గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (18:06 IST)

చిన్నప్పటి నుంచి స్వయంతృప్తి అలవాటు ఉంది.. తప్పా? ఒప్పా?

చాలామంది యువతీ యువకులకు స్వయంతృప్తి అలవాటు ఉంటుంది. స్వయంతృప్తితో భావప్రాప్తి పొందిన తర్వాత తప్పు చేసిన భావన కలుగుతుంది. అలాగని మరుసటి రోజు ఆ పని చేయకుండా ఉండలేరు.

చాలామంది యువతీ యువకులకు స్వయంతృప్తి అలవాటు ఉంటుంది. స్వయంతృప్తితో భావప్రాప్తి పొందిన తర్వాత తప్పు చేసిన భావన కలుగుతుంది. అలాగని మరుసటి రోజు ఆ పని చేయకుండా ఉండలేరు. అసలు స్వయంతృప్తి అనేది తప్పా? ఒప్పా?. స్వయంతృప్తి పొందటం అనేది సహజసిద్ధమైన చర్యేనా? స్వయంతృప్తి వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా? అనే అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే..
 
యుక్త వయసులో ఉండేవారు మాత్రమే కాదు... పెళ్లయిన స్త్రీపురుషులు కుడా స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్వయంతృప్తి ద్వారానే జీవితంలో మొదటి లైంగిక తృప్తి పొందుతారు. అందుకే స్వయంతృప్తి సహజసిద్ధమైన, సాధారణమైన చర్య అని పిలుస్తారు. 
 
స్వయంతృప్తి వల్ల శారీరకంగా, మానసికంగా ఎటువంటి అస్వస్థతలూ కలగవు. ఎంత తరచుగా చేసినా ఎటువంటి సమస్యలూ తలెత్తవు. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ సార్లు స్వయంతృప్తి సాధన చేయటం వల్ల మర్మాయవాల్లో కొద్దిగా నొప్పితో కూడిన అసౌకర్యం కలగవచ్చు. 
 
కొందరు భాగస్వాములతో స్వయంతృప్తి పొందుతూ ఉంటారు. ఈ పద్ధతి లైంగిక కలయిక కంటే ఎంతో సురక్షితం. ఈ పద్ధతి వల్ల ఒకరి నుంచి మరొకరికి సుఖ వ్యాధులు సోకకుండా ఉంటాయి. అయితే మర్మావయవ స్రావాలు చేతుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సరఫరా జరగకుండా ఉండాలి.
 
ఎంత తరచుగా స్వయంతృప్తి పొందినా ఎటువంటి నష్టమూ జరగదు. లైంగిక కోరికలను అదుపు చేసుకుని ఒత్తిడికి లోనవటం లేదా లైంగిక కోరికలను అదుపు చేసుకోలేక లైంగిక దాడులకు పాల్పడటం కంటే స్వయంతృప్తితో లైంగిక సంతృప్తి పొందటం అన్ని విధాలా క్షేమకరం.