రొమాన్స్ పండాలంటే.. ఇలా చేయండి

రొమాన్స్ పండాలంటే.. ఈ పని చేయాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆధునికత పేరుతో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అందరూ తీరికలేకుండా గడుపుతున్నారు. ఆహార నియమాల్లో తేడాలు.. సమయం లేకపోవడంతో దంపతులు రొమాన

milk glass
selvi| Last Updated: గురువారం, 13 జులై 2017 (12:59 IST)
రొమాన్స్ పండాలంటే.. ఈ పని చేయాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆధునికత పేరుతో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అందరూ తీరికలేకుండా గడుపుతున్నారు. ఆహార నియమాల్లో తేడాలు.. సమయం లేకపోవడంతో దంపతులు రొమాన్స్ పట్ల శ్రద్ధ చూపట్లేదు. దీంతో అనారోగ్య సమస్యలు, లైంగిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వారు రోజూ గోరువెచ్చని జీడిపప్పు పాలను సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని పాలలో తురుమిన జీడిపప్పు ముక్కలను, రెండు స్పూన్ల తేనె కలిపి సేవిస్తే నిద్రకు ఉపక్రమించేందుకు ముందు సేవించాలి. ఇలా చేస్తే రొమాన్స్ పండిస్తారు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇక జీడిపప్పు పాలలో విటమిన్ ఇ, ప్రోటీనులు అధికంగా ఉంటాయి. జీడిపప్పులోని పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి దాంపత్య జీవితానికి ఎంతగానో తోడ్పడుతాయి. ఇందులో జింక్ టెస్టోటెరిటీన్ ఉత్పత్తికి వుపయోగపడుతుంది. జీడిపప్పుతో పాటు ఆకుకూరలు, వాల్ నట్స్, వెల్లుల్లి, ఓట్‌మీల్, వేరుశెనగ కూడా దాంపత్య ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :