1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2015 (15:05 IST)

మధుమేహం వచ్చిన స్త్రీపురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గుతాయా?

నా వయస్సు 26 యేళ్లు. ఇటీవల రక్తపరీక్ష చేయిస్తే చక్కెర వ్యాధి ఉన్నట్టు తేలింది. మధుమేహం వచ్చినవాళ్లకి సెక్స్ కోరికలు తగ్గుతాయని, శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరని పలు పత్రికల్లో చదివాను. అది నిజమేనా? నాకు ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకోవచ్చా? సలహా ఇవ్వండి.
 
సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వాళ్లందరికీ కోరికలు తగ్గాలని, సెక్స్‌లో పాల్గొనలేరన్నది అవాస్తవం. కొంతమందికి దీర్ఘకాలంగా మధుమేహం ఉండి, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో లేకపోవడం... మరికొందరిలో రక్తనాళాలు మందంగా తయారై యోని, ఇతర జననాంగాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల సెక్స్‌లో ఇబ్బంది ఏర్పడుతుంది. 
 
అంతేగానీ, ఇతరాత్రా ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఈ విషయంపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ వ్యాయామం చేసినట్టయిదే, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా మితాహారం తీసుకుంటూ, బరువు పెరగకుండా నియంత్రించుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. సెక్స్‌లో కూడా హుషారుగా పాల్గొనవచ్చు.