దాంపత్య జీవితం పండాలంటే.. రెడ్ వైన్, పాలకూర, డార్క్ చాక్లెట్ తీసుకోండి..

దాంపత్య జీవితం పండాలంటే రోజువారీ డైట్‌లో క్యారెట్, పాలకూర, ఉల్లి, బెండకాయలు వుండేలా చూసుకోవాలి. పాలకూరలో అమినోఆసిడ్స్, పోలేట్ వంటివి శృంగార సమస్యలను దూరం చేస్తాయి. పాలకూరను వారానికి రెండుసార్లు తీసుకో

Selvi| Last Updated: గురువారం, 31 ఆగస్టు 2017 (10:01 IST)
దాంపత్య జీవితం పండాలంటే రోజువారీ డైట్‌లో క్యారెట్, పాలకూర, ఉల్లి, బెండకాయలు వుండేలా చూసుకోవాలి. పాలకూరలో అమినోఆసిడ్స్, పోలేట్ వంటివి శృంగార సమస్యలను దూరం చేస్తాయి. పాలకూరను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. శృంగార వాంఛల్ని ఉద్రేక పరిచే గుణం టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.
తరచూ టమోటాలను తీసుకోవడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే బెండ కాయల్లోని జింక్ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక ఉల్లిపాయలు కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవే కాకుండా బీట్‌రూట్‌లోని నైట్రేట్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా దాంపత్యసుఖం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఇవేకాకుండా.. స్ట్రాబెర్రీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, శృంగార జీవితానికి మేలు చేస్తుంది. ఓట్ మీల్ సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఇవి శరీరంలోని టెస్టోస్టెరాన్ లెవల్స్‌ను పెంపొందిస్తుంది. అది శృంగార జీవితానికి బాగా సహాయపడుతుంది. దాపత్య జీవితానికి రెడ్ వైన్ బాగా పనిచేస్తుంది. ఇంకా డార్క్ చాక్లెట్ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :