భర్త దగ్గర మంచి మార్కులు కొట్టేయాలంటే.. భార్య ఏం చేయాలి?
పెళ్లికి ముందు ప్రతి యువతి తనకు కాబోయే శ్రీవారి గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. ఆ కలలను నిజం కావాలని కోరుకుంటుంది. కొంతమందికి ఈ నిజంలో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది మాత్రం అభిప్రా
పెళ్లికి ముందు ప్రతి యువతి తనకు కాబోయే శ్రీవారి గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. ఆ కలలను నిజం కావాలని కోరుకుంటుంది. కొంతమందికి ఈ నిజంలో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది మాత్రం అభిప్రాయభేదాలతో దాంపత్యంలో సుఖం లేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు కూడా తమ జీవితాన్ని కొన్నిమార్పుల ద్వారా అందంగా మార్చుకోవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో భర్త కంటే భార్యకే ఎక్కువ బాధ్యత ఉందని వారంటున్నారు. కొన్ని విషయాలు అమ్మాయిలు తప్పక పాటిస్తే వారు కన్న కలలు నిజమవుతుంది.
కొత్తగా పెళ్లైన అమ్మాయి మెట్టినింట్లో అడుగుపెట్టగానే అత్తను అమ్మలా చూసుకోవాలి. అప్పుడే అత్త దృష్టిలో, మీ భర్త దృష్టిలో మంచి ఇల్లాలనిపించుకుంటారు. అత్త అధికారం కొద్దీ ఒక్కమాటన్నా సహనంతో సర్దుకుపోవాలి. లేకపోతే మొగుడితో గొడవ, వేరు కాపురాలు… వేరు కుంపట్లు తప్పవు. ఒక్కసారి పుట్టినింటి నుంచి మెట్టినింట్లో కాలుమోపాక ఇంటి పేరే కాకుండా... బంధాల మధ్య దూరాలు పెరిగిపోతాయి. భార్య తన అమ్మానాన్నను చుట్టాలుగానే భావించాలి తప్ప కుటుంబ సభ్యుల్లా చూడకూడదు. అలా భావిస్తే భార్యాభర్తల మధ్య అంతరం పెరిగే అవకాశముంది.
మంచి భార్యగా భర్త దగ్గర మార్కులు కొట్టేయ్యాలంటే ఒక్కటే మార్గం ఉంది. అదేంటో తెలుసా... మీ అవసరాల కంటే భర్త అవసరాలకే అధిక ప్రాముఖ్యత నివ్వాలి. అప్పుడే మీ పట్ల మీ భర్త ప్రేమానురాగాలను కురిపిస్తాడు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. అవి అనవసర రాద్దాంతానికి పునాదిగా నిలుస్తుంది. మగాళ్లకు అహం ఉంటుంది. అందువల్ల స్త్రీలే సహనంతో వ్యవహరించాలి. భూదేవికున్నంత ఓర్పు స్త్రీకి ఉందని పెద్దలు ఊరికే అన్నమాటలు గుర్తుంచుకుంటే సరి.