శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 25 జనవరి 2019 (22:11 IST)

సంతానలేమికి మగవారు కారణం ఇందుకే... ఇలా చేస్తే?

ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, వాతావరణ కాలుష్యం వల్ల చాలామంది దంపతులు సంతాన లేమి సమస్యతో సతమతమవుతున్నారు. అయితే దంపతులలో భార్యాభర్తలిద్దరూ ప్రత్యుత్పత్తి వ్యవసలు సరిగా పని చేసినప్పుడే సంతానం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది. అయితే స్త్రీల మాట అటుంచితే ప్రధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్నప్పుడే సంతానం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. 
 
వీర్యంలో శుక్రకణాలు ఏ మాత్రం సరిగా లేకపోయినా లేదంటే ఉండాల్సిన సంఖ్య కన్నా శుక్రకణాలు తక్కువగా ఉన్నా దాంతో సంతాన సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వారు సరైన ఆరోగ్య సూచనలు పాటించి సంతానం పొందవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. గాలిలో అత్యధిక కాలుష్యం కారణంగా వారిలో మగ వీర్య కణాల సంఖ్య మాత్రం తగిన సంఖ్యలోనే ఉన్నట్లు నిర్ధారించారు. కానీ వాటి సామర్థ్యం లోపించడం కారణంగా.. ఈ వీర్య కణాలు గర్భధారణ కోసం పనికిరానివిగా మారిపోతున్నాయని తేల్చారు. కాలుష్యం వల్ల పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గిపోతోందని గుర్తించారు.
 
15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 6,500 మంది పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి, వాటి పరిస్థితి, క్రియాశీలత తదితర అంశాలపై మూడు నెలల పాటు అధ్యయనం చేశారు.
 
2. చేపలు ఎక్కువగా తినే వారిలోనే వీర్యం నాణ్యంగా ఉంటుంది. దాంతో పాటు శుక్ర కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
 
3. వ్యాయామం చేయని వారిలో వీర్యం సరిగా ఉండదు. నిత్యం గంట పాటు వ్యాయామం చేసే వారిలో వీర్యం నాణ్యంగా ఉండి శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా శుక్రకణాలు బాగా యాక్టివ్‌గా ఉంటాయి.
 
4. టమోటాలో ఉండే లైకోఫిన్ వీర్యం మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. టమోటాలు ఎక్కువగా తినే వారిలో వీర్యకణాల నాణ్యత పెరుగుతుందట.
 
5. మందారాలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. వీర్యకణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా నలబై రోజుల పాటు తీసుకుంటే మీ వీర్యకణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు.
 
6. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో రెండు సార్లు గుప్పెడు నువ్వులను తినడం వల్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని శృంగార నిపుణులు చెబుతున్నారు.