1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2015 (14:54 IST)

నా భర్త అతి చూషణ వల్ల స్తనాలు వదులుగా మారి ఆకారాన్ని కోల్పోయాయి.. ఏం చేయాలి?

నా వయస్సు 31 యేళ్ళు. ఓ బాబు ఉన్నాడు. నేను, నా భర్త ఎంతో ప్రేమగా ఉంటాం. శృంగారంలో కూడా ఎంతో హుషారుగా పాల్గొంటాం. అయితే ఆ సమయంలో నా భర్త అతిగా చూషించడం వల్ల నా స్తనాలు వదులుగా అయిపోయాయి. ఆకారాన్ని కోల్పోయాయి. పరిమాణం కూడా తగ్గి చిన్నగా కనిపిస్తున్నాయి. అవి మళ్లీ మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలి? క్రీములవీ రాసినా, సర్జరీలు చేయించుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నా స్నేహితులు చెపుతుంటారు. ఏం చేయాలి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజాల సైజుల్లో మార్పులు వస్తాయా? 
 
స్తనాలను చూషించడం వల్ల వదులుగా అవడం జరగదు. పైగా రెగ్యులర్ మసాజ్‌లా పని చేస్తుంది. దాంతో రక్త ప్రసరణ పెరిగి, రొమ్ములు నిండుగా తయారవుతాయి. రొమ్ముల్లో పాలగ్రంథులు, ఫైబ్రస్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. ఆ కొవ్వు తగ్గడం వల్ల వాటికి సపోర్ట్ తగ్గి, చర్మం సాగినట్లయ్యి, వదులుగా చిన్నగా అనిపించడం జరుగుతుంది. కొందరికైతే ప్రసవం తర్వాత, బిడ్డకు పాలివ్వడం మానేసిన తర్వాత పాలగ్రంథులు తగ్గిపోయి రొమ్ములు వదులుగా, చిన్నగా అవుతాయి. రెగ్యులర్‌గా రొమ్ముల్ని మసాజ్ చేసుకుంటూ, కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్నట్టయితే ఫలితం ఉంటుంది.