1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chitra
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (08:41 IST)

సెక్స్ గురించి తెలియని కొన్ని నిజాలు...!

సెక్స్ గురించి మాకు అన్ని తెలుసు అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి సెక్స్‌లో ఎన్నో తెలియని విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజామా అని అనిపించే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలోంచి కొన్

సెక్స్ గురించి మాకు అన్ని తెలుసు అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి సెక్స్‌లో ఎన్నో తెలియని విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజామా అని అనిపించే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలోంచి కొన్ని మీ కోసం..
 
ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని శరీరం నుండి రెండు వారాల్లో ఉత్పత్తి అయ్యే వీర్యంతో ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ గర్భధారణ చేయొచ్చట.
 
వీర్యకణాలు శరీరం బయట అయితే కొద్ది గంటలే జీవిస్తాయి, అవే స్త్రీ జననాంగంలో ప్రవేశిస్తే 3 నుండి 5 రోజులు జీవించి ఉంటాయి.
 
సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేస్తే మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను కొద్దివరకు అరికట్టవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సెక్స్ ఎంతగానో సహకరిస్తుంది. లైంగిక చర్యలో పాల్గొన్నాక బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది, అలజడి కూడా తగ్గుతుంది.
 
తలనొప్పిని తగ్గించే సహజమైన ఔషధం సెక్స్. స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్) వచ్చే ముందు రోజుల్లో సెక్స్ మీద బాగా ఆసక్తి చూపుతారు. సెక్స్‌లో భావప్రాప్తి పొందే సమయంలో గుండె నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది.
 
స్త్రీలలో స్వయం తృప్తి పొందేటప్పుడు 4 నిమిషాల్లోనే భావప్రాప్తి జరుగుతుంది, అదే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు 10 నుండి 20 నిమిషాలు పడుతుంది. ఎక్కువమంది స్త్రీలు బాగా వెలుతురు ఉన్న గదిలో కన్నా తక్కువ వెలుతురు లేదా చీకటిగా ఉన్న గదిలో సెక్స్ చేయడానికే ఇష్టపడుతారు.