శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (16:00 IST)

మద్యం సేవిస్తున్నారా.. అయితే శృంగార శక్తి తగ్గిపోతున్నట్టే...

మద్యం సేవించే వారిలో శృంగార శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తాగుడుకి బానిస కావడం వల్ల టెస్టోస్టిరాన్‌ అనే హార్మన్స్ ఉత్పత్తి తక్కువగా ఉంటుందని, దీనివల్ల శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనలేరని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
దీనికితోడు గుండెజబ్బులు, ఎముకలు బలహీనపడటం వంటివి కూడా జరుగుతాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. అయితే మూడు వారాల పాటు మితంగా మద్యం తీసుకునే వ్యక్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ 7 శాతం మేరకు తగ్గిపోయిందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ, ప్రతి రోజూ ఒకటి లేదా రెండు పెగ్గులు మద్యం తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్యా ఉండదని చెపుతున్నారు. 
 
అయితే ఆ స్థాయిమించితే మాత్రం శృంగారంలో తేలిపోవాల్సిందేనని వారు హెచ్చరిస్తున్నారు. అతిగా మద్యం సేవిస్తే.. శరీరంపై ఒత్తిడితో పాటు, మానసికంగా ఒత్తికి ఏర్పడుతుందని, తద్వారా మగతనం యొక్క సామర్ధ్యం తగ్గిపోతుందని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది.