సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (18:25 IST)

శృంగారంలో పాల్గొంటే ఆమె లావవుతుందా?

నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తనకు అసలు వక్షోజాలు ప్లాట్‌గా ఉన్నట్లనిపిస్తాయి. ఐతే ముఖం మాత్రం చాలా అందంగా ఉంటుంది. ముఖానికి తగ్గట్లు వళ్లు కూడా చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఐతే ఆమె అలా సన్నగా, పీలగా ఉంటే పెళ్లాడేటపుడు ఎగతాళి చేస్తారేమో అని బాధగా ఉంది. 
 
లావయ్యేందుకు ఆమె చాలా కష్టపడుతోంది. అప్పుడప్పుడు నావద్ద లావు కావడం లేదని ఆవేదన చెందుతోంది. కానీ ఏం చేసినా ఫలితం ఉండటంలేదు. రోజుకు రెండుసార్లు బాగా శృంగారం చేస్తే ఒళ్లు వస్తుందనీ, ఆకర్షణీయంగా మారుతుందని నా స్నేహితుడొకరు చెప్పాడు. అది నిజమేనా...?
 
మీ స్నేహితుడు చెప్పిందంతా అవాస్తవం. ఇది అపోహ. శృంగారం చేస్తే ఒళ్లు చేస్తారనేది విశ్వసించలేము. ఐతే శృంగారం చేసే సమయంలో స్త్రీ శరీరం ఆ అనుభవాన్ని ఆస్వాదించడం వల్ల తృప్తి కలుగుతుంది. అంతేకాదు ఆ సమయంలో కొన్ని స్రావాలు విడుదల కావడం వల్ల ఫ్రెష్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. అంతేకానీ లావనేది శృంగారం చేయడంపై ఆధారపడి ఉండదు.
 
ఆమె డిగ్రీ చదువుతుందంటే ఆమె వయసు 20 ఏళ్లే. కనుక ఒళ్లు చేయడానికి ఇంకా టైముంది. ఆమె శరీరంలో మార్పు వచ్చి ఒళ్లు చేయాలంటే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఇందుకుగాను మంచి డైటీషియన్‌ను కలిసి తగు సలహా తీసుకోండి. శరీర సౌష్టవం అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు తగిన వ్యాయామం చేస్తే ఒంపుసొంపులు ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. అంతేకానీ, శృంగారం చేయడం ద్వారా అవన్నీ వస్తాయని అనుకోవడం అపోహ. పెళ్లి కాకుండా శృంగారం చేయడం లేనిపోని చిక్కులు వస్తాయి.