బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (21:11 IST)

శృంగారం ముగిశాక కూడా పురుషుడి నుంచి స్త్రీ అది కోరుకుంటుందట...

శృంగారంలో తనివితీరా తృప్తిని పొందాలని, తన భార్య తృప్తి పడేలా సుఖపెట్టాలని ఖచ్చితంగా ప్రతి భర్తకీ ఉంటుంది. ప్రతి భర్త అలాగే అనుకోవాలి కూడా. అయితే కొంతమంది శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం శీఘ్ర స్ఖలనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటివారు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.
 
1. శృంగారంలో పాల్గొనేటప్పుడు మగవాడు కోపంగా ఉండకూడదు, చాలా ప్రశాంతంగా శృంగారాన్ని ఆస్వాదించేలా ఉండాలి. నిగ్రహం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
 
2. భార్య దగ్గరకు రాగానే ఓ ఆవేశపడిపోయి, ఆరాటంగా వెంటనే మీద పడిపోకూడదని అంటున్నారు. అంటే స్త్రీకి ఎలాగు త్వరగా భావప్రాప్తి కలుగదు కాబట్టి భర్త ముందుగా సహనంతో ఉండి భార్య ఫీలింగ్స్‌ని బట్టి శృంగారంలో పాల్గొనాలి.
 
3. అలా ఇద్దరూ కొంత టైం ఎంజాయ్ చేశాక అంటే... భార్య సంతృప్తిగా ఉన్న సమయం గమనించి భర్త చివరి దశకు అంటే సంభోగానికి వెళ్లాలి. ఇది ముగిశాక కూడా శృంగారం చేస్తే మహిళలు చాలా ఇష్టపడతారని చెపుతున్నారు. 
 
4. శృంగారం ముగిసిన తరువాత కూడా మగవారు తన భార్యను ప్రేమగా తాకుతూ కొంతసేపు కబుర్లు చెప్పాలట. అలా చేస్తే భర్యాభర్తలిద్దరూ శృంగార జీవితంలో సంతృప్తికరమైన సంతోషాన్ని పొందుతారని ఖచ్చితమైన నిర్దారణగా చెబుతున్నారు.