గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (21:22 IST)

శృంగారం చేయరా మగడా... అంటే, నలిగిపోతావు వద్దులే అంటాడేమిటి? ఆయన ఆ టైపా?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించుకునే సమయంలో నేనంటే ఎంతో ప్రాణంగా ఉండేవాడు. దానితో పెళ్లటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టి మరీ చేసుకున్నాను. పెళ్లయి రెండేళ్లయింది. నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. కనీసం చేయి కూడా వేయడు. నేనే చొరవ చూపి దగ్గరికి వెళితే... నలిగిపోతావు వద్దు అంటూ నన్ను దూరంగా ఉంచుతాడు. మొదట అదంతా నాపై ప్రేమతో అనుకుని సరిపెట్టుకున్నా.
 
ఐతే ఈమధ్య అతడికి మగ ఫ్రెండ్స్ అధికంగా కనబడుతున్నారు. వారితో సినిమాలు, షికార్లు చేస్తున్నాడు. బాగా పొద్దుపోయాక ఇంటికి వస్తున్నాడు. పొద్దస్తమానం మగవారి గురించి కబుర్లు చెపుతున్నాడు. శృంగారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ప్రవర్తన అలాగే ఉంటోంది. ధైర్యం చేసే చొరవ చూపుతున్నా నావద్దకు అసలు రావడంలేదు. అతడి ప్రవర్తన చూస్తుంటే అతడేమైనా స్వలింగ సంపర్కుడేమోననే అనుమానంగా ఉంది. నిజంగా అతడు 'గే'నే అంటారా...?
 
రెండేళ్లయినా శృంగారంలో పాల్గొనకుండా కాలయాపన జరుగుతూ పోతుందంటే అనుమానించక తప్పదు. కానీ అతడు మిమ్మల్ని తాకేందుకు ఉన్న సంశయాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో కనీసం కొద్దోగొప్పో నిజం తెలుసుకునే వీలుంటుంది. శృంగార పరంగా దగ్గర కాలేదు కనుక మీకు ఆ అనుమానం కలుగడం సహజమే. మీ అనుమానం నివృత్తి అయ్యేందుకు సైకాలజిస్టు వద్దకు ఆయనను తీసుకెళ్లి చెక్ చేయించండి.