మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (14:49 IST)

శృంగార సంబంధ సంభాషణ తెస్తే వెంటనే లైట్ ఆర్పేస్తారు... ఆయనకేమైనా జబ్బా?

మా పెళ్లయి రెండేళ్లు దాటిపోయింది. కానీ బెడ్రూంలో ఆయన ప్రవర్తనపై ఇంతవరకూ నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆయన చేసే పద్ధతి నాకు అర్థం కాదు. ఆయనకు శృంగారం అంటే ఇష్టమా లేదంటే యాంత్రికంగా అలా చేస్తున్నారా అనేది కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనతో అలాంటి మాటలు మాట్లాడాలంటే కుదరదు. రాత్రివేళ గదికి వస్తారు. ఏవేవో మాట్లాడుతారు. శృంగార సంబంధ సంభాషణ తెస్తే వెంటనే లైట్ ఆర్పేస్తారు. 
 
గబుక్కున దుస్తులు తొలగించి శృంగారం చేసి స్ఖలించి, ముగిసిందన్నట్లు లేచి వెళ్లిపోతారు. ఆ తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడినా వినేందుకు ఉత్సాహం చూపించరు. చెప్పాలంటే ఈ రెండేళ్ల కాలంలో ఆయనతో ఆ సంబంధ విషయాలను మాట్లాడిందే లేదు. నాకు ఆయనతో ఆ కార్యం అసహజమైనదిగా అనిపిస్తోంది. అసలిలా ఎవరైనా ప్రవర్తిస్తారా... ఇతనొక్కడే ఇలా చేస్తున్నారా...?
 
కొందరిలో ఇలాంటి ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే కొందరి స్త్రీలలో శృంగారం పట్ల ఉన్న వ్యతిరేక భావనే అరుదుగా కొందరి పురుషుల్లో కనబడుతుంది. శృంగారం చేయడం అనేది వారి దృష్టిలో తప్పుగా ఉంటుంది. భార్య ఒత్తిడి కారణంగా యాంత్రికంగా పాల్గొని, ముగిసిన వెంటనే ఇలా నిష్క్రమిస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో స్త్రీ మరికొద్దిగా చొరవ చూపించాల్సి ఉంటుంది. 
 
ఇందుకు చాలా ఓర్పు అవసరం. భార్యాభర్తలు ఇద్దరూ విహార యాత్రలకు వెళ్లాలి. ఆ ప్రదేశాల్లో కొద్దోగొప్పో వారిలో మార్పు కనబడుతుంది. శృంగార సంబంధ పుస్తకాలను, భంగిమలను అతడికి వివరించే ప్రయత్నం చేయాలి. ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించేది అయినప్పటికీ ప్రయత్నం చేయక తప్పదు. అప్పటికీ అతడిలో మార్పు రానట్లయితే మానసిక వైద్యుడి సలహా తీసుకోవాల్సిందే.