టీచర్ ఉద్యోగం వచ్చింది... శృంగారం అంటే నీతి పాఠాలు చెబుతోంది... ఎలా?

couple
Last Updated: గురువారం, 3 జనవరి 2019 (19:14 IST)
నా వయస్సు 38 యేళ్లు. నా భార్య వయస్సు 35 సంవత్సరాలు. మాకు పదేళ్ల కుమార్తె ఉంది. నా భార్య టీచర్. ఆమె ఉద్యోగం చేస్తూనే అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నా కుమార్తె పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అయితే, ఆమెకు శృంగార కోర్కెలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

మాకు వివాహమైన మొదట్లో ఎంతో యాక్టివ్‌గా వుండేది. అప్పట్లో పని ఒత్తిడితో నేనే కాస్త వెనక్కి తగ్గేవాడిని. ఆమె యాక్టివ్ పార్ట్ తీసుకుని శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్లం. ఐదేళ్ల క్రితం ఆమెకు టీచర్ ఉద్యోగం వచ్చింది. తెలుగు టీచర్ ఉద్యోగం రావడంతో స్కూల్లో చెప్పే నీతి పాఠాలు ఇంటికి వచ్చాక కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి స్కూలు పాఠాలు తప్పించి మరొకటి చెప్పడంలేదు.

మా అమ్మాయికి ఎదురుగ్గా కూర్చుని రాత్రి పది గంటలైనా లేవడంలేదు. నాకు నిద్ర వచ్చి చాలాసార్లు నిద్రపోతున్నాను. ఎప్పుడైనా మేలుకుని శృంగారం చేసేందుకు ప్రయత్నిస్తే నా నోటి మీద వేలు వేసి చెడ్డపని అంటోంది. కాళ్లావేళ్లా పడితే ఏదో నెలకు రెండుమూడుసార్లు అంగీకరిస్తోంది. ఆమె ఎందుకిలా అయిపోయిందో తెలియడంలేదు. దీంతో కౌన్సెలింగ్‌కు వెళదామని చెప్పాను. కానీ ఆమె సమ్మతించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియడంలేదు.

మీ పరిస్థితి మరింత దయనీంగానే వుంది. చాలామంది మహిళలు మధ్య వయస్సులోకి ప్రవేశించిగానే శృంగార పట్ల ఆసక్తిని చూపించరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. శరీరంలో హార్మోన్ల మార్పులు. బాధ్యతలు పెరగడం. ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువ కావడం. వయస్సు మీద పడుతుందనే భావన కలగడం. ఇతర వ్యాపకాల వల్ల పెద్దగా ఆసక్తి చూపరు. పైగా నీతి కథలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదివి, శృంగారం అంటే తప్పు అనే భావనకు వచ్చేసినట్లు కనబడుతోంది. ఐతే జీవితంలో శృంగారమనేది ఓ భాగమని ఎన్నో పురాతన గ్రంథాల్లో చెప్పబడిన సంగతిని మీరు కూడా చదివి చెప్పండి. అలాంటి పుస్తకాలను వెదికి ఆమెకి ఇవ్వండి. తప్పకుండా మారుతుంది. లేదంటే... ఖచ్చితంగా కౌన్సిలింగుకు వెళ్లాల్సిందే.దీనిపై మరింత చదవండి :