శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (20:32 IST)

రాత్రిపూట ఫుల్లుగా శృంగారం... ఆఫీసులో నిద్ర... ఏం చేయాలి?

మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లయి మూడేళ్లయింది. ఈ మూడేళ్ల కాలంలో మేమిద్దరం రోజూ రాత్రిపూట కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతున్నాం. ఎందుకంటే... రాత్రిపూట బెడ్రూంకి చేరిన దగ్గర్నుంచి ఇద్దరం ప్రేమ కబుర్లు చెప్పకుంటాం. అలాగే రెండుమూడుసార్లు శృంగారంలో పాల్గొంటాం. ఆ తర్వాత టైం చూసుకుంటే తెల్లవారు జాము 3 లేదా 4 గంటలవుతోంది. మళ్లీ తిరిగి ఆఫీసుకు ఉదయం 8 గంటలకు వెళ్లాలి కనుక త్వరగా నిద్ర లేచి వెళ్లిపోతుంటాం. దాంతో మాకు నిద్ర సరిపోవడం లేదు. ఆఫీసులో నిద్రపోతున్నాం. 
 
పోనీ... శృంగారంర చేసుకోవడం ఆపేసి కొన్నాళ్లు విడివిడి గదుల్లో నిద్రపోయేందుకు ప్రయత్నించాం. అది కూడా వర్కవుట్ కాలేదు. నేనో లేదంటో తనో 15 నిమిషాల్లో ఒకరి వద్దకు ఇంకొకరు వెళ్లి పాల్గొంటున్నాం. మాకు నిగ్రహం ఉండటం లేదు. దీన్ని సాధించడం ఎలా?!!
 
పెళ్లయిన తర్వాత రెండుమూడేళ్ల పాటు జంటలు శృంగార ఆనందం కోసం ఆరాటపడటం సహజమే. కాబట్టి ఆ అనుభవాన్ని మరింత చవిచూడాలని అనుకుంటారు. మీ విషయంలో ఇలా ఆఫీసుకు వెళ్లి అక్కడ నిద్రపోయి యాజమాన్యం దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకునే కంటే ఓ 15 రోజుల పాటు ఆఫీసుకు ఇద్దరూ శెలవు పెట్టి హనీమూన్‌కు వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రయత్నించి చూడండి.