శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శనివారం, 2 మార్చి 2019 (16:43 IST)

నన్ను అక్కడ తాకగానే నా భర్త ఔటైపోతున్నారు... ఏం చేయాలి?

ఇటీవలే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా. నా భర్త చూడటానికి బాగానే ఉంటారు. కానీ, పడక గదిలో తుస్ మంటున్నారు. దీనికి కారణం నా వక్షోజాలను తాకగానే ఆయనకు వీర్య స్ఖలనమైపోతోందట. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆయనకు స్తంభించడం లేదు.

చివరకు సిగ్గు విడిచి చేయాల్సిందినంతా చేస్తున్నా ఆయన వల్లకావడంలేదు. ఇప్పటి వరకు ఇద్దరం శారీరకంగా కలుసుకోలేదు. ఏం చేయాలి. నా పరిస్థితి ఏ యువతికీ రాకూడదు. ఏం చేయమంటారు. ఒక్కోసారి కోర్కెలను అణుచుకునేందుకు వేళాపాళా లేకుండా చన్నీటి స్నానం చేయాల్సి వస్తోంది. సలహా ఇవ్వండి. ప్లీజ్.! 
 
చాలామంది పురుషులకు వివాహమైన కొత్తలో ఈ తరహా సమస్యను ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం వారిలో నెలకొన్న ఆందోళన, ఒత్తిడితో పాటు.. పడక గదిలో భార్యను తృప్తిపరచలేకపోతున్నానన్న భయం. అందువల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. రోజులు గడిచే కొద్దీ.. ఈ సమస్యను అధికమించవచ్చు. అప్పటికీ సమస్య ఉంటే నిపుణుల వద్ద తగు సలహా తీసుకోక తప్పదు. అలాగే, పడక గదిలో మీ భర్తను మీరు మరీ అంత ఒత్తిడి చేయవద్దు. కాస్త సమయం ఇస్తే అదే సర్దుకుని శృంగారంలో పూర్తిస్థాయిలో పాల్గొనగలుగుతారు.