గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:34 IST)

పురుషులు శృంగార సామర్థ్యంలో బలహీనులు ఎందుకు అవుతారు?

ప్రస్తుత కాలంలో చాలామంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు లైంగిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది శృంగార సమస్యలతో బాధపడుతున్నారు.
 
నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాల వలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. 
 
లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్ఖలనం, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. శృంగార హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండే ఉపయోగిస్తున్నారు.
 
ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటం వంటి వ్యసనాలను వదిలివేయాలి.