అశ్లీల బొమ్మలను చూస్తూ శృంగారం చేయడం జబ్బా?
కొంతమంది పురుషులు శృంగారం చేసేటపుడు కొన్ని అశ్లీల బొమ్మలను చూస్తూ చేస్తుంటారన్న ఫిర్యాదులు వైద్యుల వద్దకు వస్తుంటాయి. ఎపుడు శృంగారంలో పాల్గొన్నా ఇదే తంతు. అటువైపు భార్య వున్నదన్న స్పృహే ఉండదు.
కొంతమంది పురుషులు శృంగారం చేసేటపుడు కొన్ని అశ్లీల బొమ్మలను చూస్తూ చేస్తుంటారన్న ఫిర్యాదులు వైద్యుల వద్దకు వస్తుంటాయి. ఎపుడు శృంగారంలో పాల్గొన్నా ఇదే తంతు. అటువైపు భార్య వున్నదన్న స్పృహే ఉండదు. ఇలాంటి ప్రవర్తన వున్న పురుషుల గురించి ఎవరికి చెప్పినా వేరేవిధంగా అనుకుంటారని భాగస్వామి ఏమీ చెప్పలేక అలాగే భరిస్తుంటుంది. దీని గురించి వైద్య నిపుణులు చెప్పే మాట ఏమిటంటే... సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువతీ యువకుల్లో ఇలాంటి పాంటసీలుండటం సాధారణం.
తమకు నచ్చినవారితో శృంగారంలో పాల్గొన్నట్టు ఊహించుకుంటారు. ఐతే మరీ ఈ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసైపోయినట్లుండే వారి విషయంలో కాస్త కటువుగా వుండక తప్పదు. అలాంటివి ఇష్టం లేదని సున్నితంగా చెప్పాల్సిందే. అప్పటికీ దారికి రాకపోతే మీ పెద్దవారితో సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవాలి. అతడు మరీ ఆ చిత్రాలకు బానిసై ఉంటే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తగు చికిత్స అందించాలి.