పెళ్లయినా అతడితో అలా అంగీకరించా... ఇప్పుడేమో అతడలా అంటున్నాడు...

beauty
Last Modified బుధవారం, 19 డిశెంబరు 2018 (14:28 IST)
మా ఆఫీసులో కొలీగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి ఏడాది అయ్యింది. ఐతే అతడు ఎంతో మంచివాడు. నా పట్ల మొదట్నుంచీ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఎలాగూ అతడికి భార్యతో విడాకులయ్యింది కనుక అతడిని పెళ్లాడాలనుకున్నాను. మనసులో ఉన్న ఆలోచనను ముందుగా మా తల్లిదండ్రులతో చెప్పేశాను. వాళ్లు ఓకే అన్నారు. పెళ్లి చేసుకోబోయే ముందు ప్రేమికులుగా ఓసారి శృంగారం చేద్దామన్నాడు.

అతడి కోర్కె నాకు కూడా నచ్చింది. పెళ్లికి ముందు ఓసారి లవర్స్‌గా శృంగారంలో పాల్గొందామన్న అతడి అభ్యర్థనను అంగీకరించాను. ఆ రోజు ఎంతో తృప్తి కలిగింది. ఆ తర్వాత మరోసారి కలిశాం. త్వరలో పెళ్లాడుదామనుకుంటుంటే ఇంతలో అతడి మాజీ భార్య వచ్చేసింది. విడాకులు తీసుకుని తప్పు చేశాననీ, తనతో మళ్లీ కాపురం చేస్తానని అతడి కాళ్ల మీద బ్రతిమాలుతోందట. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. అతడు ఆమె పట్ల మళ్లీ ప్రేమాభిమానాలు చూపుతున్నాడు. పెళ్లి గురించి మాట్లాడితే ఇప్పుడే తొందరేముంది... చూద్దాంలే అంటున్నాడు. నా పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదు...

పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం ఎవరికైనా చిక్కులు తెస్తాయి. విడాకులు తీసుకున్నాడు ఇక నాకు అడ్డంకులు ఏమీ ఉండవని మీరు అనుకున్నట్లున్నారు. అందువల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. పెళ్లికి ముందు ఇలా పాల్గొన్నవారి విషయంలో చాలామందికి ఇలాంటి మోసం జరుగుతున్నట్లు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాడిని పెళ్లాడాలా వద్దా అనేది ఇక మీ నిర్ణయమే.దీనిపై మరింత చదవండి :