గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (10:14 IST)

గంటల తరబడి కంప్యూటర్లతో కుస్తీ... శృంగారానికి నై అంటున్న స్త్రీలు...

ఆధునిక ప్రపంచంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా, ఐటీ ప్రపంచంలో విధులు నిర్వహించే స్త్రీలు... రాత్రి పూట తమ భర్తలకు పడక సుఖాన్ని అందివ్వలేకపోతున్నారు. దీనికి కారణం.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వస్తోంది. దీంతో శృంగారంలో పాల్గొనలేక తమ భర్తలను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేస్తున్నారు. 
 
నిజానికి ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. జీవితంలో ఎంతో ఆనందమయంగా అనుభవించవలసిన దాంపత్య సుఖాన్ని స్త్రీలు నరకం చేసుకుంటున్నట్లు ఈ సర్వేలు పేర్కొంటున్నాయి. మారుతున్న వారి జీవన విధానంతో నడుముపట్టు కోల్పోతున్నారు. కార్యాలయాల్లో... లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి పనిచేయటం కారణంగా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పితో బాధపడుతున్నారు. 
 
ఈ నొప్పి సెక్స్‌లో పాల్గొనటంతో మరింత ఎక్కువవుతోంది. వారానికోసారన్నా సెక్స్‌లో పాల్గొనలేని స్త్రీల సంఖ్య రానురాను పెరుగుతోందని ఆ సర్వేలో తేలింది. ఈ సమస్య కారణంగా భార్యాభర్తల సంబంధాలు బెడిసికొడుతున్న సందర్భాలు అధికమవుతున్నాయి. 
 
ఈ సమస్యకు బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో మీ శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు చెపుతున్నారు.