రోజులో 2-3 సార్లు కలుస్తున్నాం.. పిల్లలు ఇపుడే వద్దనుకుంటున్నాం.. ఐపిల్ వేసుకోవచ్చా?
నా వయస్సు 24 యేళ్లు. రెండు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరం విద్యావంతులమే. అయితే, పిల్లలు మాత్రం ఇపుడే వద్దనుకుంటున్నాం. జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పిల్లలు పుట్టించుకోవాలని భావిస్తున్నాం. అయితే, ఈ మధ్యలో రోజుకు రెండు మూడుసార్లు శారీరకంగా కలుస్తున్నాం. అప్పుడే పిల్లలు వద్దనుకోవడం వల్ల నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడు ఐపిల్ వేసుకుంటున్నాను. అయితే నాకో సందేహం. ఆ పీరియడ్ ముగిసేవరకూ కలిసిన ప్రతిసారీ ఐపిల్ వేసుకోవాలా? లేక రోజుకొక్కసారి వేసుకుంటే ఎన్నిసార్లు కలిసినా ఫర్వాలేదా? ఇలా ఐపిల్ ఎక్కువ వాడటం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా?
దీనిపై వైద్య నిపుణులను సంప్రదిస్తే.. ఐపిల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకుగాను ఎప్పుడో ఒకసారి వేసుకునే మాత్ర మాత్రమే. అంతేకాని కలిసినప్పుడల్లా దానిని వేసుకోకూడదు. ఈ మాత్రలో ప్రొజెస్టరాన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆసమయంలో అండం తయారుకాకుండా, వీర్యకణాలు అండంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా కలిసిన 24 గంటలలోపల వేసుకోవాలి. లేదంటే కనీసం 72 గంటలు గడవక ముందు అయినా వేసుకోవాలి. ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిదన్నమాట.
అయితే గర్భం రాకపోవడం అన్నది మాత్రం వారివారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. 60 నుంచి 90 శాతం మందిలో మాత్రమే ఇది గర్భం రాకుండా అడ్డుకోగలుగుతుంది. మిగతా శాతం వారిలో ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు లేకపోలేదు. మోతాదును మించి, అంటే నెలలో రెండు మూడుసార్లు వేసుకుంటే... రొమ్ముల్లో నొప్పి, తలనొప్పి, వికారం, పీరియడ్స్ క్రమం తప్పి త్వరగా రావడం, ఒళ్లు బరువెక్కడం వంటి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. గర్భసంచికి కూడా హానికలిగే ప్రమాదముంది. అందుకే నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడల్లా ఐపిల్ వేసుకోవడం మానేసి... కండోమ్స్ వాడుకోవడం ఎంతైనా మంచిది.