శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 22 జూన్ 2015 (16:42 IST)

సెక్స్ అంటేనే నా భర్త హైరానా పడిపోతాడు.. ఇద్దరికీ అసంతృప్తి... ఏం చేయాలి?

నాకు ఇటీవలే వివాహమైంది. నా భర్తకు సెక్స్ అంటేనే హైరానా పడిపోతున్నాడు. దీంతో శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క రాత్రి కూడా సంతృప్తికరమైన భావప్రాప్తిని పొందలేదు. ఈ పరిస్థితి నాకే కాదు.. ఆయనకు కూడా ఉంది. హైరానా పడొద్దని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఫలితంగా శీఘ్రస్ఖలనంతో నిరుత్సాహరుస్తున్నాడు. ఏం చేయాలి?
 
 
దాంపత్యం అనేది నెమ్మదిగా అనుభవిస్తూ ఆనందించవలసిన అంశం. అందుకే సెక్స్‌లో పాల్గొనే దంపతులకు హడావుడి పనికిరాదు. పడక గదిలో ఎంత ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొంటే అంత ఆనందం పొందుతారు. అయితే, ఇందుకు అనువైన వాతావరణాన్ని కల్పించుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యాభర్తలపైనే వుంది. పడక గదిలో ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించుకోవడంతో పాటు... మానసిక సంసిద్ధత కూడా ఎంతో ముఖ్యం. అంటే మనస్సులో మొదలైన సెక్స్ కోరిక శరీరానికి వ్యాపించినపుడే సెక్స్ ఆనందం కలుగుతుంది. 
 
అదేసమయంలో సెక్స్ పాల్గొనే దంపతులు మొబైల్ ఫోన్స్ వంటివి దూరంగా ఉంచుకోవడం మంచిది. ఇలాగే, ఇతర ఆలోచనలన్నీ పక్కనబెట్టి, కేవలం సంభోగంపైనే మనస్సు లగ్నం చేయండి.. ముద్దూముచ్చట్లు, స్పర్శలు, కౌగిలింతలు, ఇతరాత్రా చిలిపి చేష్టలతో ఇద్దరూ కామోద్రేకం పొంది ఆ తర్వాత అసలు కార్యక్రమానికి పూనుకున్నట్టుయతే నిజమైన సెక్స్ అనుభూతిని ఆశ్వాదిస్తారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.