1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 6 నవంబరు 2014 (13:38 IST)

నా భార్య వక్షోజాల సైజుల్లో తేడాలు ఉన్నాయ్ ఎందుకని?

మాది తెనాలి. ఇటీవలే వివాహమైంది. నా భార్య పాలిండ్ల సైజుల్లో తేడాలు ఉన్నాయి. ఎందుకో తెలియడం లేదు. కుడి వక్షోజం పెద్దగానూ, ఎడమవైపున ఉండేది చిన్నదిగా ఉంది. ఇలా ఎందుకు ఉన్నాయని అడిగితే రజస్వల అయినప్పటి నుంచి సైజుల్లో తేడాలు ఉన్నట్టు చెపుతోంది. ఇలా ఎందుకు ఉంటాయి? 
 
సాధారణంగా చాలా మంది వక్షోజాల్లో ఇలాంటి తేడాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. పైగా తొందరపడి ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్లకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వక్షోజాల సైజుల్లో తేడాలు ఉన్నట్టు గుర్తిస్తే... జాకెట్ లోపలిభాగంలో మన ఆకారానికి తగినట్టుగా ప్యాడ్స్ ఉంటాయి. వీటితో ఎడ్జెస్ట్ కావొచ్చని చెపుతున్నారు. 
 
అలాగే, వక్షోజాలు చిన్నవిగా ఉండటానికి, పెద్దవి అవడానికి కూడా శరీరాకృతులు మార్చుకునే రీతిగానే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. వీటి ద్వారా పాలిండ్ల సైజులను తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఒక వక్షోజం మరో వక్షోజంతో పోల్చుకున్నపుడు మరీ చిన్నదిగా ఉన్న సమయంలో మామోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తప్పని సరిపరిస్థితుల్లోనే చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.  
 
అలాగే, నిపుల్స్ విషయంలోనూ చాలా ఆందోళనలు ఉంటాయి. సాధారణంగా మహిళలో సెక్స్ ఆందోళనలు లేకుంటేనే నిపుల్స్‌లోనికి ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. ఇవి సెక్స్ స్పందనలు కలిగినపుడు ముందుకు పొడుచుకుని వస్తాయి. ఇలా ఉండటం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. హార్మోన్లలో మార్పులు కూడా వక్షోజాల పరిమాణాన్ని నిర్ధేశిస్తుంటాయి. వీటన్నింటినీ గమనించి... అవసరమైతేనే వైద్యురాలని సంప్రదించాలని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు.