1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 17 నవంబరు 2014 (18:10 IST)

త్వరలో పెళ్లాడబోతున్నా... శోభనం నాడు ఆమె నుంచి నేను ఏమి ఆశించవచ్చు...?

మా పేరెంట్స్ ఓ అమ్మాయిని చూసి పెళ్లి కుదిర్చారు. నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ ఆమెతో మాట్లాడటాన్ని వారి పెద్దలు అంగీకరించలేదు. దాంతో పెళ్లి రోజు దగ్గరవుతున్నకొద్దీ నాలో టెన్షన్ పెరుగుతోంది. అసలు పెళ్లి చేసుకునే మగవారు పెళ్లయిన తర్వాత శోభనం రోజున తన భార్య వద్ద ఏమి ఆశించవచ్చు...?
 
ఇలాంటి సందేహాలు చాలామంది పురుషులు వ్యక్తం చేస్తుంటారు. శోభనం రోజున కొందరు పురుషులు ఎలాంటి మాటలు లేకుండా సెక్స్ వద్దకు వెళ్లిపోతారు. పెళ్లి చేసుకున్న యువతితో మాటల్లేకుండా ఇది కానించేస్తుంటారు. కానీ ఆమె ఏం కోరకుంటుందనేది చాలామందిని వేధించే ప్రశ్నే. ఒక సర్వే ప్రకారం... ఆమె మీ గురించి తెలుసుకోవాలనుకుంటుంది కాబట్టి మీరేమిటో చెప్పాలి. అలాగే పెళ్లయ్యాక మీ అంచనాలు, మీ జీవిత లక్ష్యాలను తెలుసుకోవాలనుకుంటుంది. అదేవిధంగా వాటి గురించి చర్చించాలనుకుంటుంది. 
 
మీ ప్రాధామ్యాలను బట్టి నడుచుకోవాలనుకుంటుంది కాబట్టి వాటిని అడుగుతుంది. అలాగే ఎలాంటి బిడియం లేకుండా మీతో మాట్లాడే అవకాశాన్ని కోరుకుంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా మీరు సన్నద్ధమవ్వాలి. మీరు ఇచ్చే తొలిరాత్రి బహుమతిని బట్టి ఆమె ప్రతిస్పందిస్తుంది. ఫోర్ ప్లేతో పరవశిస్తుంది. దీనినిబట్టి ఆమె స్పందిస్తుంది. అదేవిధంగా సెక్సుకు ఆమె అనుకూలంగా లేనట్లయితే అది మీతో చెప్పాలనుకుంటుంది. ఆ చొరవ మీవద్ద ఆమెకు ఉంటేనే. 
 
ఆఖరుగా కండోమ్ ధరించకుండా సెక్సులో పాల్గొనాలనే కోర్కెకు ఆమె అంగీకారం కావాలంటే పైన చెప్పిన అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇపుడు ప్రతి అమ్మాయికి పెళ్లయిన తర్వాత ఎలా జీవించాలన్న దానిపై ఓ అంచనా ఉంటుంది. కాబట్టి మీరు ఆమెకు ఏమి ఇస్తారోనన్న దానిపై ఆమె నుంచి ఏమి ఆశించవచ్చన్నది ఆధారపడి ఉంటుంది.