శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 17 సెప్టెంబరు 2015 (21:35 IST)

రాత్రి 11 గంటలకు భోంచేసి వెంటనే మొదలుపెడతారు... కరెక్టేనా...?

నా భర్త రోజూ బాగా పొద్దుపోయాక వస్తారు. రాత్రి 11 గంటలకు భోజనం చేసిన వెంటనే హడావుడిగా రతి క్రియ చేస్తారు. నాకు ఏమాత్రం తృప్తి ఉండదు. కానీ... పాపం ఆయన మరీ ఎక్కువసేపు మేల్కొని ఆరోగ్యం పాడు చేసుకుంటారేమోనని ఒప్పుకుంటుంటా. అసలు ఈ క్రియకు సమయపాలన ఏమైనా ఉన్నదా...?
 
రతి క్రీడకు కూడా ఓ నిర్ధిష్ట సమయం ఉంది. నూతన వధూవరులకు శోభనం రోజు రాత్రి అంగ ప్రవేశానికి మంచి లగ్నం పెట్టినట్టే.. ఇతర రోజుల్లో కూడా సెక్స్‌కు ఓ సమయం సందర్భం ఉందని నిపుణులు చెపుతున్నారు. వీటినే రతి క్రీడ గోల్డెన్ రూల్స్‌గా పిలుస్తారు. 
 
* పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. 
 
* చాలా మంది రాత్రి ఏడు గంటలకే భోజనం చేస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10 - 11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. 
 
* నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంట ముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
* స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించరాదు.తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
* కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇలాంటి భావన మంచిది కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు లేదా ఉద్రేకానికి గురికారాదు. 
 
* రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ.. ఫోర్‌ప్లే చేసుకుంటూ స్త్రీ భావప్రాప్తి పొందేలా చేయాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం చేసినట్టయితే సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరూ సంతృప్తి పొందుతారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.