గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Ivr
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (20:58 IST)

తనకు జరిపిన నిశ్చితార్థం చెడగొట్టేసుకుంది... వాట్సాప్‌లో రమ్మని పిలుస్తోంది... ఏంటిలా...?

ఓ అందమైన అమ్మాయితో మా పేరెంట్స్ నిశ్చితార్థం చేశారు. నాకు కాబోయే భార్య చాలా అందగత్తె అని మురిసిపోయాను. నిశ్చితార్థం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆమె నన్ను పార్కుకు రమ్మంది. ఎంతో ఆనందంగా వెళ్లిన నాకు షాకిచ్చింది. తన మనసులో ఆల్రెడీ ఓ అబ్బాయి ఉన్నాడనీ, అది తన తల్లిదండ్రులు ఒప్పుకోకుండా నీతో నిశ్చితార్థం జరిపించారనీ, దయచేసి దాన్ని రద్దు చేసుకోమని కోరింది. చేసేది లేక నా పేరెంట్స్‌కు విషయం చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేయించుకున్నాం. ఆ తర్వాత మరో 15 రోజులకు ఆమె నన్ను వాట్సప్‌లో పలుకరించింది. 
 
తను పొరబాటు పడ్డాననీ, తను ప్రేమించిన అబ్బాయి మంచివాడు కాదనీ, మీతో పర్సనల్‌గా మాట్లాడాలని అంటోంది. ఆ తర్వాత మా ఫోన్ సంభాషణ అలా కొనసాగుతూనే ఉంది. మళ్లీ నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. పేరెంట్స్ ఒప్పుకోరంటే... ఒప్పించమని బతిమాలుతోంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడగలనా... మళ్లీ పాత సంగతులను తోడుకొస్తుందా...?
 
ఒకసారి నిశ్చితార్థం వద్దన్నాక మళ్లీ అదే అమ్మాయితో పెళ్లి అంటే పెద్దలు ఒప్పుకునే అవకాశాలు దాదాపు కష్టమే. ఐతే మీ ఇద్దరు ఎలాంటి మొహమాటాలు లేకుండా... అంటే మీరు అడగాల్సిన ప్రశ్నలన్నిటినీ ఆమె వద్ద ప్రస్తావించి చూడండి. ఆమెను కూడా మీపై ఎలాంటి ప్రశ్నలు వేయాలనుకున్నా వేయమనండి. ఆ తర్వాత మీ ఇద్దరికీ సంతృప్తి కలిగించినట్లయితే నిర్మొహమాటంగా మరోసారి పెద్దలను కలిసి ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించండి.