శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2015 (22:33 IST)

నా భార్యకు అదంటే చిరాకు... ఆమె దానికి పనికిరాదేమోనని....

నా భార్య అంటే నాకు ప్రాణం. ఆమె గత ఏడాదిన్నరగా నాతో సెక్సులో పాల్గొనడంలేదు. ఐతే ఇది కేవలం ఆమెకు అదంటే ఉత్సాహం లేకపోవడమే అని నేను కనుక్కున్నాను. నేను ఒత్తిడి చేసి సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తే ఏడుస్తోంది. దండం పెడుతోంది. ఆమెను అలాంటి స్థితిలో నేను చూడలేను. వెంటనే నా ప్రయత్నాన్ని ఆపి మళ్లీ చేయనని బతిమాలి బుజ్జగిస్తున్నాను. కానీ అపుడపుడు సెక్స్ కోర్కెలను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఆమెకు ఏమైనా అనారోగ్యమా... లేదంటే అందుకు ఆమె పనికిరాదా...? అసలెందుకు ఇలా ప్రవర్తిస్తోంది...?
 
పెళ్లయిన కొత్తలో చాలామంది యువతులకు సెక్స్ అంటే భయం ఉంటుంది. కుటుంబ పరిస్థితులను బట్టి కొందరిలో సెక్స్ అంటేనే విముఖతను పెంచుకుంటారు. దీంతో వారిలో ఫ్రిజిడిటీ చోటుచేసుకుంటుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినపుడు సెక్స్ విషయంలో మనసు స్పందించదు. అలా స్పందించనప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది. 
 
భర్త ఈ పరిస్థితిని గమనించి కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉంటూ ఆమెను సెక్స్‌కు సమాయత్తపరిచేందుకు అవసరమైన పద్ధతులను అవలంభించాలి. ప్రేమ సంభాషణలు చేస్తూ అప్పుడప్పుడు కామోద్రేకాన్ని రేపే శరీర భాగాలపై సున్నితంగా, ప్రేమగా నిమురుతూ మాటలతోనే దారికి తీసుక వచ్చేందుకు కృషి చేయాలి. 
 
ఆమెకు సంతోషం కలిగించే పనులు ఏమిటో తెలుసుకుని వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తూ పోతే ఏదో ఒకనాడు ఆమె సెక్స్‌‍కు ఆహ్వానం పలుకుతుంది. అప్పటిదాకా ఓర్పు తప్పనిసరి. ఓర్పు లేకపోతే తీయని అనుభూతులను పంచాల్సిన సెక్స్ సుఖం చేదు అనుభవాలను మిగులుస్తుంది.