మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2015 (14:20 IST)

పెళ్లి కాలేదు... ఆ పని చేసిన దగ్గర్నుంచి నాకు భయమేస్తోంది... ఎందుకిలా?

నా వయసు 25 సంవత్సరాలు. నాకింకా పెళ్ళి కాలేదు. నాకేమో సెక్స్ కోరికలు విపరీతంగా వస్తున్నాయి. ఒక అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నాను. కాకపోతే ఆమెతో కలిసిన 5 నిముషాలకే వీర్యస్ఖలనం అయిపోయింది. పైగా నా అంగం వెంటనే చిన్నదైపోయింది. కోరిక కలిగినప్పుడు తప్ప నా అంగం మిగతా సమయాల్లో చిన్నదిగానే వుంటుంది. దీనికి కారణం ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసుకోవడం వలనేమో అని భయంగా వుంది. లేక వేరే ఇతర కారణాల వలన కూడా ఇలా జరిగే అవకాశం వుందా?? అసలు రోజుకి హస్త ప్రయోగం ఇన్నిసార్లు మాత్రమే చేసుకోవాలి అని నిబంధనలేమైనా వున్నాయా??? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. 
 
పెళ్లి కాకుండానే సెక్సులో పాల్గొనడం వల్ల మనసులో భయం, ఆందోళన ఉంటాయి. వీటి కారణంగా సెక్సును పరిపూర్ణంగా ఆస్వాదించలేని స్థితి ఉంటుంది. సెక్స్ చేసేటపుడు తమను ఎవరైనా గమిస్తారేమోనన్న భయం మనసులో ఉండటం వల్ల అంగప్రవేశం చేశాక 5 నిమిషాల్లో వీర్యస్ఖలనమైపోతోంది. హస్తప్రయోగం ఇన్నిసార్లే చేసుకోవాలనే నిబంధన ఏదీలేదు. కాకపోతే అదేపనిగా రోజంతా ఏ పని చేసినా అలసిపోతారు. కాబట్టి దేనికైనా మితం అవసరమే. పురుషాంగం స్తంభించినప్పుడున్న పరిమాణం ఆ తర్వాత ఉండదు. ఇది అందరి పురుషుల్లోనూ ఇలాగే ఉంటుంది.