శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:15 IST)

ఆమెతో అలా చేసేటపుడు చిట్లింది... నా భార్య నుంచి ఎలా తప్పుకోవాలా అని చూస్తున్నా...

నా వయసు 40 ఏళ్లు. ఇటీవలి కాలంలో హఠాత్తుగా నా ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు కన్పిస్తోంది. నా భార్యతో సెక్స్ చేసేటపుడు ఇదివరకు ఎంతో తృప్తిగా ఉండేది. ఇప్పుడది లేకపోగా చాలా భయంకరంగా మారిపోయింది. పురుషాంగం పూర్వచర్మ బిగుతుగా మారుతోంది. అంగం బాగా స్తంభించినప్పుడు సెక్స్ చేస్తుంటే ఈ పూర్వచర్మ చిట్లిపోయి రక్త కూడా కారుతోంది. దాంతో నాకు సెక్స్ చేయాలంటేనే భయమేస్తోంది. రాత్రయితే నా భార్య నుంచి ఎలా తప్పుకోవాలా అని చూస్తున్నానని చెప్పేందుకు సిగ్గుగానూ ఉంది. సమస్య పరిష్కారానికి మార్గమేంటి?
 
మధుమేహం ఉన్నవారిలో ఈ పరిస్థితి కనబడుతుంది. రతి చేసేటపుడు పురుషాంగపు పూర్వచర్మ చిట్లడం, ఆ తర్వాత బిగుసుకుపోవడం, శిశ్నంపై నుండి చర్మం వెనక్కి రాకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. పురుషాంగపు పూర్వచర్మం చిట్లినపుడు చాలా బాధ కలుగుతుంది. మరికొందరిలో శశ్నింపై ఉన్న చర్మం గట్టిగా బిగుసుకుపోయి వెనక్కి లాగినా రాకుండా అవుతుంది. దాంతో శిశ్నానికి రక్తప్రసారం సాఫీగా జరుగదు. ఫలితంగా శిశ్నం మొద్దుబారినట్లు అవుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి.