శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:33 IST)

ముద్దు పెట్టుకున్నాడు... థ్రిల్ అనిపించింది... ఇక మొదలెట్టేశాడు...

ఈమధ్య ఓ అబ్బాయితో నాకు పరిచయమైంది. చాలా అందంగా ఉంటాడు. నాకు బాగా నచ్చాడు. ప్రతిరోజూ కలిసి గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటాం. ఓ రోజు చనువు తీసుకుని ముద్దు పెట్టేశాడు. నాకు చాలా థ్రిల్ అనిపించింది. మరొక రోజు కబుర్లు చెపుతూ ఇంతకుముందు మరో గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ అనుభవం అని ఏదో చెప్పబోయి ఆపేశాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు నిజంగా సెక్స్ అనుభవం చవిచూశాడా... లేదంటే నాకోసం ఏదో గొప్పలు చెపుతున్నాడు.. ఇతడి విషయంలో నేను ఏం చేయాలి...?
 
చాలామంది అబ్బాయిల ఆలోచనలు సెక్స్ మీదే ఉంటాయి. అలాగని ప్రత్యక్షంలో పాల్గొనకపోయినా అబ్బాయిలు తమ ఊహా సెక్స్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఇతడి విషయంలో అతడు నిజమే చెపుతున్నాడా.. లేదా గొప్పలు కోసం ఇలా చెపుతున్నాడా అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అందుకోసం కొన్నాళ్లు అతడితో కబుర్లు చెపుతూ వాస్తవాన్ని రాబట్టాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా అతడిని వదులుకోవడం శ్రేయస్కరం.