శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2015 (17:07 IST)

ఆయన తగిన సామర్థ్యం చూపలేకపోతున్నారు... పెంచుకునేందుకు ఏం తినాలి?

మాకు పెళ్లయి రెండేళ్లు దాటిపోయింది. ఐతే ఇప్పుడు ఆయన పడకగదిలో సామర్థ్యం చూపలేకపోతున్నారు. ఈ విషయం ఆయనకు చెబితే నొచ్చుకుంటారని చెప్పలేకపోతున్నా. కానీ ఆయన లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఏమైనా ఆహార పదార్థాలుంటే చెప్పండి....
 
లైంగిక శక్తిని పెంచుకునేందుకు కొంతమంది వయగ్రా వంటి మందులు వాడుతుంటారు. కానీ సహజసిద్ధంగా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మనకు దొరికే కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. 
 
ఇలాంటి వాటిలో మొదటిది బీట్రూట్. ఇందులో అధిక మోతాదులో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తసరఫరా వేగాన్ని పెంచుతాయి. అలాగే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల పురుషుడు లైంగిక సమర్థత పెరుగుతుంది. మరొకటి క్యారెట్. ఇందులో ఎ విటమిన్ ఉంటుంది. విటమిన్ ఎ, లైంగిక శక్తికి మధ్య సంబంధం ఉంది. విటమిన్ ఎ వీర్యవృద్ధికి దోహదపడుతుందని వైద్య పరిశోధనలో తేలింది.
 
మూడవది... వెల్లుల్లి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల అల్లిసిన్ తో నిండి ఉంటుంది. ఇది జననాంగ ప్రదేశంలో రక్తసరఫరాని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టమేటో... ఇందులో లైకోపీన్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య దరిచేరదు. అలాగే ప్రొస్టేట్ కేన్సర్ సమస్యను దరిచేరనీయదు. వీటితోపాటుగా పెద్దఉల్లిపాయలు, బ్రకొలి వంటివి తీసుకుంటూ ఉంటే సెక్స్ సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతుంది.