శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2015 (20:43 IST)

కండోమ్ లేకుండా కలిస్తే గర్భం రాకూడదు... ఎలా...?

నా గర్ల్ ఫ్రెండుతో సెక్స్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పటివరకూ కండోమ్ ధరించి సెక్స్ చేశాను. కానీ అది లేకుండా చేసేందుకు ఆమె ఒప్పుకోవడంలేదు. గర్భం వస్తుందని భయపడుతోంది. కండోమ్ ధరించకుండా గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి...?
 
ముందుగా మీరు పెళ్లి కాకముందు సెక్సులో పాల్గొనడం సత్వరమే ఆపివేయడం అన్నివిధాలా మంచిది. ఒకవేళ సెక్సులో పాల్గొనాల్సి వస్తే గర్భం రాకుండా పిల్ 72 అనే టాబ్లెట్లు వాడాలి. ఈ మాత్రలు సెక్సులో పాల్గొన్న 12 గంటల లోపుగా వాడాలి. మొదట ఒక టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత 12 గంటలు గడిచాక మరో మాత్ర వేసుకోవాలి. ఇలా 12 గంటల తేడాతో 2 బిళ్లలు వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. ఐతే చదువు ముగించేంతవరకూ ఇద్దరూ సెక్సుకు దూరంగా ఉండండి. పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్య సుఖం అనుభవించవచ్చు.