మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2015 (21:58 IST)

నాకు బ్యాక్ పెయిన్ ఉంది... అందుకు పనికిరావంటున్నాడు నా ఫ్రెండ్....

నా వయసు 23 ఏళ్లు. నాకు చాలా కాలంగా బ్యాక్ పెయిన్ వస్తోంది. వైద్యుడిని సంప్రదించి ప్రస్తుతం ఆయన ఇచ్చిన మందులను వాడుతున్నాను. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు సెక్సుకు పనికిరారని నా మిత్రుడు చెపుతున్నాడు. నిజమేనా...?
 
మీ స్నేహితుడు చెప్పేది అవాస్తవం. అతడు మిడిమిడి జ్ఞానంతో ఏదో చెపుతున్నాడు. అంగస్తంభనలు మామూలుగా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నా సెక్స్ సామర్థ్యం తగ్గదు. నడుము వద్ద ఉండే లిగమెంట్లు, కండరాలు బాగా బలహీనంగా ఉన్నా ఇలా పెయిన్ వస్తుంది. మీరు స్పైనల్ ఎక్సర్‌సైజ్ చేయండి. నడుము కండరాలు బలం పుంజుకుని బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం ఉంటుంది.