1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (18:38 IST)

నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండుతో కలిసి పాల్గొన్నా... నేనిప్పుడేం చేయాలి...?

నేను చేసింది చాలా పెద్ద తప్పు. అలా ఎందుకు జరిగిందో అర్థంకావడంలేదు. నాకు చిన్నప్పట్నుంచి స్నేహితురాలు ఉంది. ఆమె ఓ ఆరు నెలల క్రితం ఓ అబ్బాయితో పరిచయం పెట్టుకుంది. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నా ఫ్రెండ్ తన బోయ్ ఫ్రెండును నాక్కూడా పరిచయం చేసింది. ఓ రోజు నేను నైట్ పార్టీకి వెళ్లాను. అనుకోకుండా అతడు కూడా ఆ పార్టీకి వచ్చాడు. 
 
పార్టీకి వచ్చిన అతడితో చాలాసేపు మాట్లాడుతూ గడిపాను. డిన్నర్ చేస్తూ బీర్ తీసుకున్నాం. మత్తులో ఇద్దరం చాలా క్లోజయ్యాం. అది శారీరక సంబంధానికి దారి తీసింది. ఆ రాత్రి ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. ఐతే, నా ఫ్రెండ్ ప్రేమిస్తున్న అబ్బాయితో నేను సెక్సులో పాల్గొనడంతో నాకు నిద్రపట్టడంలేదు. నా స్నేహితురాలిని మోసం చేశానని బాధపడుతున్నాను. అతడు ఏమీ తెలియనట్లే ఉంటున్నాడు. నా స్నేహితురాలితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నేను నా స్నేహితురాలి ముఖం చూడలేకపోతున్నాను. ఈ విషయం నా స్నేహితురాలికి చెప్పాలా వద్దా అని సతమతమవుతున్నాను. ఇపుడేమి చేయాలి...?
 
అది క్షణికావేశంలో జరిగిన తప్పు. ఏదేమైనా తను మీ స్నేహితురాలి బోయ్ ఫ్రెండ్ అని తెలిసి కూడా అతడికి చనువు ఇవ్వడం మీరు చేసిన తప్పు. అతడి ప్రవర్తన పైన కూడా అనుమానం వస్తుంది. ఏదేమైనా ఈ విషయాన్ని స్నేహితురాలికి చెప్పాల్సిందే. ఆమెను ఏకాంతంగా కూర్చోబెట్టి విషయం చెప్పండి. నిద్రాహారాలు మాని బాధపడటం కంటే నిజాన్ని ఆమె ముందు ఉంచితే మొదట తను కోప్పడినా, ఆ తర్వాత ఆమె అర్థం చేసుకుంటుంది. తదుపరి నిర్ణయం ఏమిటన్నది ఆమె నిర్ణయించుకోగలదు.