శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:34 IST)

రతిలో పాల్గొనండి.. ఒత్తిడిని తగ్గించుకోండి..!

రతిలో పాల్గొనండి.. ఒత్తిడిని తగ్గించుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రతి క్రీడ వల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే మంచి కెమికల్స్ విడుదల అవుతాయి. తద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి గ్రేట్‌గా తగ్గిస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో ఒత్తిడిని ఇవి మటాష్ చేస్తాయి. రతి క్రీడలో పాల్గొనడం వల్ల, శరీరంలో ఎలాంటి నొప్పులనైనా సరే తక్షణం నివారిస్తుంది. 
 
చాలా మంది పురుషులు హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు, రెగ్యులర్‌గా రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ ఆరోగ్యంగా ఉంచి, క్యాలరీలను కరిగిస్తుంది. ఇంకా కండరాలను బలోపేతం చేస్తుంది. 
 
ఇకపోతే.. ఎవరైతే రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటారో అలాంటి వారిలో హార్ట్ సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కండరాలు విశ్రాంతి పొందుతాయి. నిద్రించే ముందు సెక్స్ లో పాల్గొనడం మజిల్ రిలాక్సేషన్ వల్ల మంచి నిద్రపడుతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవచ్చు.