శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 21 ఆగస్టు 2014 (18:40 IST)

మరో పురుషుడితో సెక్స్ చేస్తుంటే ఆమె కుమారుడు దొంగచాటుగా చూశాడు...

నా స్నేహితురాలు ఓ విషయంపై చాలా బాధపడుతోంది. ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక తల్లడిల్లుతోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతోంది. ఆమె భర్తతో ఆమెకు విడాకులయ్యాయి. ఇది జరిగి నాలుగేళ్లయింది. ఐతే ఆమెకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. తను విడాకులు తీసుకున్న తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉంది. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడట. తనకు చాలా సహాయం చేస్తుంటాడని చెపుతుంది. అతడితో పరిచయం శారీరక సంబంధానికి దారితీసిందట. 
 
ఈమధ్య అతడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరూ సెక్సులో పాల్గొన్నారట. ఆ సమయంలో ఆమె కుమారుడు గదిలో నిద్రపోతున్నాడనుకున్నదట కానీ అతడు లేచి తలుపు వద్ద నిలబడి వాళ్లు ఏం చేస్తున్నారో చూసేశాడట. అప్పుడు వారిద్దరూ నగ్నంగా ఉన్నారట. నా స్నేహితురాలు తన కుమారుడిని చూసి గబుక్కున దుస్తులు కట్టుకున్నదట. ఐతే ఆ పిల్లాడు అలా చూస్తూ మళ్లీ గదిలోకి వెళ్లిపోయాడట. ఇపుడు ఆ పిల్లవాడు తనను ఎలా అనుకుంటాడోనని ఆందోళనగా ఉందనీ, తన పట్ల అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం కావడంలేదని బాధపడుతోంది. ఆ పిల్లవాడితో ఎలా డీల్ చేయాలో చెప్పమంటుంది...
 
వివాహేతర సంబంధాలు ఇలాగే చిక్కులు తెస్తుంటాయి. మీ స్నేహితురాలికి సహాయపడుతున్న పురుషుడికి పెళ్లయిందో లేదో తెలుపలేదు. ఒకవేళ పెళ్లి కానట్లయితే అతడు మీ స్నేహితురాలని ఇష్టపడుతుంటే, ఒకరి భావాలు ఒకరివి కలిస్తే పెళ్లి చేసుకుని దాంపత్య సుఖాన్ని ఆస్వాదించవచ్చు. ఒకవేళ అతడికి పెళ్లయి ఉన్నట్లయితే తక్షణం ఆ సంబంధానికి దూరం కావాలి. ఇక పసి మనసులో పడిన ముద్రను అంత తేలిగ్గా చెరిపేయడం సాధ్యం కాదు. ఐతే పిల్లవాడి దృష్టిని చదువు, క్రీడలు వంటి వాటిపై మరల్చేట్లు చేస్తూ ఉంటే క్రమంగా అతడు వాటి నుంచి దూరం కావచ్చు. కానీ ఈ చేదు జ్ఞాపకం మాత్రం అతడిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతుందని మాత్రం చెప్పజాలము.