శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 18 జులై 2015 (20:30 IST)

22 ఏళ్ల మా అబ్బాయి 34 ఏళ్ల యువతితో లేచిపోయాడు... ఆమె మందు పెట్టిందేమో...?

మా అబ్బాయికి 22 ఏళ్లు. ఐతే వాడికి 16వ సంవత్సరం వచ్చిన దగ్గర్నుంచి 6 ఏళ్ల క్రితం అద్దెకు దిగిన ఓ 28 ఏళ్ల యువతితో చనువుగా ఉంటుండేవాడు. ఆమె భర్త ఉద్యోగరీత్యా దేశం మొత్తం తిరుగుతుంటారు. దాంతో చిన్నచిన్న పనులకు మావాడి హెల్ప్ అడుగుతుండేది. వీడు కూడా సహాయం చేస్తుండేవాడు. ఆదివారం వస్తే ఉదయం వెళ్లి సాయంత్రం దాకా అక్కడే ఉండేవాడు. 
 
అలా 6 ఏళ్లు గడిచిపోయింది. ఇటీవల ఓ రోజు హఠాత్తుగా మావాడు కనిపించకుండా పోయాడు. వాడితోపాటు ప్రక్కింటిలో ఉన్న యువతి కూడా కనబడకుండా పోయింది. మేము వాడికోసం వెతుకుతుండగా, నాలుగు రోజుల తర్వాత వాడే ఫోన్ చేశాడు. తను ఆంటీని పెళ్లాడాననీ, తన కోసం వెతకవద్దని చెప్పాడు. కష్టపడి అడ్రెస్ కనుక్కుని వెళ్లాం. 
 
మావాడిని ఎందుకు తీసుకొచ్చావని అడిగేలోపే మమ్మల్ని నోరు మూయమన్నాడు. తనకు ఆంటీ అంటే ఎంతో ఇష్టమనీ, ఆమె తనను ఎంతగానో ప్రేమిస్తుందనీ, నేను కూడా అంతేనని తెగేసి చెప్పాడు. ఆమెను చిన్న మాట అంటున్నా మమ్మల్ని కొట్టినంత పని చేస్తున్నాడు. ఎలాగో బతిమాలితే ఇంటికి వస్తానన్నాడు. కానీ ఆమెను కూడా తెచ్చుకుంటానని అంటున్నాడు. ఆమె మా వాడికి ఏదైనా మందు పెట్టిందేమోనన్న సందేహంగా ఉంది. అతడిని మార్చేదెలా...?
 
యవ్వనంలో అడుగుపెట్టిన పిల్లల గురించి తల్లిదండ్రులు పట్టించుకోనట్లయితే ఎలాంటి నష్టం జరుగుతుందో అదే జరిగింది. పిల్లవాడు పొద్దస్తమానం పక్కింటిలో ఉంటున్నాడంటే మొదట్లోనే అనుమానించాల్సింది. అలా పట్టింపులేని ధోరణితో వదిలేయడం వల్లనే ఈ సమస్య ఎదురయింది. వాళ్లిద్దరూ సెక్స్ పరంగా దగ్గరయ్యారు కనుక దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు. పైగా మీ అబ్బాయి మేజర్ కూడా అయ్యాడు కనుక చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం సాధ్యం కాదు. మీరనుకున్నట్లు ఆమె ఏ మందూమాకూ పెట్టే సమస్యే లేదు. అది అపోహ మాత్రమే.