1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 23 జూన్ 2015 (16:22 IST)

ఫ్రెండ్స్ చెప్పే సెక్స్ కబుర్లతో ఫాంటసీలో తేలిపోతూ ఆనందం పొందుతున్నా.. తప్పా?

నేను హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. హాస్టల్ గదిలో మొత్తం ఆరుగురు ఉంటారు. వీరందరూ నిత్యం సెక్స్ కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆదిలో అవి వినేందుకు చిరాకు అనిపించినా.. ఆ తర్వాత వాటినే వినాలన్న ఆసక్తి పెరిగింది. అలా సెక్స్ కబుర్లు వినడం ప్రారంభించా. ఒక్కోసమయంలో ఆ కబుర్లు వింటూ ఫాంటసీలో తేలిపోతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నా. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
నలుగురు యువతులు లేదా యువకులు ఒక చోట చేరినపుడు సెక్స్ కబుర్లు చెప్పుకోవడం కొత్తేమీ కాదు. అలాగే, ఈ తరహా కబుర్ల పట్ల ఆసక్తి పెంచుకుని ఫాంటసీలో తేలిపోతుండటం, మరికొన్నిసార్లు నిద్రలో సెక్స్ సుఖాన్ని అనుభవించినట్టుగా కలకనడం కొత్తేమీ కాదు. యుక్త వయస్సులో ఉండే యువతీయువకుల్లో కనిపించే సహజమైన లక్షణం. సెక్స్ విషయాలు కూడా అంతే. అందువల్ల ఇలాంటి కబుర్ల పట్ల ఆసక్తి చూపడంమాని, చదువుపై ఏకాగ్రత చూపి, మంచి భవిష్యత్‌ను నిర్మించుకోండి. ఇదే అన్నింటికీ మంచిది.