1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 20 మే 2015 (19:32 IST)

నాకు ఆసక్తి తక్కువ.. ఆయనకు ఎక్కువ.. దంపతులు రోజూ సెక్స్‌లో పాల్గొనాలా?

నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మా దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు తలెత్తలేదు. అయితే, నా భర్తకు సెక్స్ పట్ల ఆసక్తి, యావ ఎక్కువ. నాకు మాత్రం తక్కువ. ఆయన కోసమే ఎక్కువ సార్లు సెక్స్‌లోపాల్గొనివుంటా. అయితే, నా భర్త మాత్రం తృప్తి కలగడం లేదని చెపుతుంటారు. ఏం చేయాలి. పైగా.. వివాహితులు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలా? లేదా వారానికి ఒకటి రెండు సార్లు పాల్గొంటే సరిపోతుందా.? నా భర్త సమస్యకు పరిష్కారమార్గమేంటి?
 
సాధారణంగా వివాహబంధం ముఖ్యోద్దేశం భార్యాభర్తలిద్దరూ పడక గదిలో ఆనందప్రాప్తి పొందుతూ తమ జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగించాలన్నదే అర్థం. సాధారణంగా దాంపత్యంలో పాల్గొనే జంటల్లో ఏమాత్రం పొంత లేకుండా సెక్స్‌లో పాల్గొన్నట్టయితే అది అర్థరహిత సెక్స్‌గా పరిగణించవచ్చు. అయితే, సెక్స్‌‌లో రోజుకు ఇన్నిసార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొనాలా అనే నిబంధనేదే లేదు. ఇది భార్యాభర్త మానసిక, శారీరక, ఆరోగ్యాలపై ఆధారపడివుంటుంది. దంపతులిద్దరూ కలిసి పంచుకునే సుఖమయ ఆనంద ప్రక్రియకు ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ అనడం అర్థరహితమవుతుంది. అందువల్ల పడక గదిలో ఒకరినొకరు సహకరించుకుంటూ, పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగడం వల్ల ఇద్దరికీ సుఖమయ ఆనందం కలుగుతుంది.