శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2015 (17:46 IST)

పురుషుల్లో నిద్రలేమి సెక్స్ సామర్థ్యం ప్రభావం చూపుతుందా?

పురుషుల్లో నిద్రలేమి ఉండడం అనేది వారి సెక్స్‌ సామర్థ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. తగినంత నిద్ర లేకపోతే.. వీర్యకణాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆధునిక జీవన విధానం ద్వారా తక్కువ నిద్రకు చాలామంది అలవాటుపడిపోతున్నారు. బయటి పనుల ఒత్తిడితో ఏ అర్థరాత్రి వేళకో ఇంటికి చేరుకోవడం మళ్లీ తెల్లవారకముందే ఉరుకులు పరుగుల మీద జీవన సమరాన్ని ప్రారంభిస్తున్న నేటి తరం యువతలో సంతాన సాఫల్యత తగ్గిపోతుందట.
 
రోజూ చాలినంత నిద్రలేకపోయినా, కొన్ని గంటల పాటే నిద్రపోయినా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని, నాణ్యత కూడా తగ్గుతుందని అధ్యయనం తేల్చింది. ఇరవయ్యేళ్ల ప్రాయంలో ఉన్న కుర్రకారుపై అధ్యయనం జరిగింది. మై హెల్త్‌ న్యూస్‌ డైలీ ప్రచురించిన వివరాల ప్రకారం.. నాలుగు వారాల పాటూ ఈ కుర్రాళ్లు నిద్రపోయిన సమయం నమోదుచేసి, ఆ రోజుల్లో వారి రక్తంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్‌, వీర్యంలను పరీక్షించారు. నిద్ర తక్కువ ఉన్న వారిలో 25 శాతం వరకు వీర్యం తగ్గినట్లు గుర్తించారు. దీంతో వారిలో సంతాన సాఫల్యత తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.