శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (17:32 IST)

ఏ వేళలో సెక్స్ మజాగా ఉంటుంది?

ఏ వేళలో సెక్స్ మజాగా ఉంటుంది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే.. సెక్స్‌కు వేళతో పనేంటి? మనస్సు ముఖ్యం గానీ అని సెలవిస్తున్నారు. రాత్రివేళ, ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణ సెక్సీ మూడ్‌ను మరింతగా రెట్టింపు చేస్తుందని చెపుతున్నారు. 
 
ఈ విషయంలో స్త్రీ పురుషుల అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయి. ఒకవేళ రాత్రి వేళ వీలుపడని పక్షంలో తాము కోరుకునే ఏ సమయంలోనైనా సెక్స్‌లో పాల్గొనవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే, మధ్యాహ్నం, సాయంత్రం వేళలు మాత్రం సెక్స్‌కు ఏమాత్రం అనుకూలం కావని చెపుతున్నారు. 
 
అంతేకాకుండా, సెక్స్‌ చేసేందుకు ఉపక్రమిస్తే.. రత్రి క్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలని ప్రతి భార్యాభర్త కోరుకుంటారు. అందువల్ల మధ్యాహ్నం, సాయంత్రం వేళలు అనువు కావన్నది వారి అభిప్రాయంగా ఉంది. కానీ, ఎక్కువ జంటలు మాత్రం రాత్రి వేళే అత్యుత్తమమైన సమయమని చెపుతున్నారు.