శృంగార కోర్కెతో తట్టుకోలేకపోతున్నా... ఆయన్నడగాలంటే సిగ్గు...

romance
Last Modified శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:52 IST)
కొత్తగా పెళ్లయినవారిలో కొన్ని జంటలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులకు ఫిర్యాదులు అందుతున్నాయి. శోభనం సమయంలో చూపిన చొరవ ఆ తర్వాత వుండటం లేదన్నది పలువురి మహిళల సమస్యగా వుంటోంది. ఉద్యోగరీత్యా పనుల్లో భర్త బిజీ అయిపోవడంతో వారానికి మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు. 
ముఖ్యంగా వారికి కోర్కె కలిగినప్పుడు పడకగదిలోకి తీసుకెళ్లి ఆ సుఖాన్ని అనుభవించేస్తున్నారనేది ఆవేదన. ఇలాంటి విషయాల్లో చాలామంది స్త్రీలు బిడియంతో అసలు విషయాన్ని చెప్పలేకపోతున్నట్లు తేలింది. ఇలా చెబితే భర్త ఏమయినా అనుకుంటాడేమోనన్న జంకు కూడా వుంటోంది. 
 
ఐతే శృంగారం విషయంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సిగ్గు, బిడియం ఉండకూడదు. కోర్కె విపరీతంగా ఉన్నప్పుడు చెప్పలేకపోయినా చేష్టల ద్వారా మెల్లిగా అతడిని రంగంలోకి దింపవచ్చు. అప్పటికీ ఆయన శృంగార పరంగా ఉద్రిక్తత చెందనట్లయితే అతడికి ఎలాంటి పనుల ద్వారా శృంగారం ఇష్టమో అలాంటి వాటి ద్వారా క్రమంగా ముందుకెళితే... శృంగారంలో పాల్గొనక తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనసులో సంకోచాలను పెట్టుకుని వుంటే సంతోషకరమయిన శృంగార జీవితం వృధా అవుతుంది.దీనిపై మరింత చదవండి :