శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (15:17 IST)

నా భార్యను ఓరల్ సెక్స్ చేయమంటే మహాపాపం అంటోంది.. ఏం చేయాలి?

కొత్తగా వివాహమైంది. శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు సెక్స్‌లో బాగానే పాల్గొంటున్నాం. అయితే, నాకు నా భార్యతో ఓరల్ సెక్స్ చేయించుకోవాలని ఆశగా ఉంది. అలాగే, నేను కూడా ఆమెకు చేస్తూ ఎంజాయ్ చేయాలన్నది బలమైన కోరిక. ఇదే విషయాన్ని నా భార్యకు చెప్పాను. ఆమె మాత్రం అందుకు సమ్మతించడం లేదు. ఎవరో ఆమె ఫ్రెండ్ చెప్పిందట. ఓరల్ సెక్స్ చేయడం మహా పాపమని. అలా చేసే వాళ్లు చనిపోయిన తర్వాత నరకానికి పోతారని. దీంతో ఆమెను ఎంతగా బ్రతిమిలాడుతున్నా నా కోర్కెను తీర్చడం లేదు. ఏం చేయాలి? 
 
శృంగార పద్ధతుల్లో ఓరల్ సెక్స్ అనేది ఒక భాగం. అనేక వేల సంవత్సరాల నుంచి అనేక సంస్కృతుల వారు ఓరల్ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అనుభవిస్తూ ఆనందపడుతున్నారు. వాత్సాయన కామసూత్రంలో ఓరల్ సెక్స్‌ గురించిన ప్రస్తావన వుంది. అయితే, కొన్ని మతాలవారు... మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవారు మాత్రం ఓరల్ సెక్స్  చేసేందుకు ఇష్టపడరు. మీ భార్యకు మూఢనమ్మకాలపై అధిక విశ్వాసం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ తరహా సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు. మీ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఆ తరహా సమాధానాలు చెపుతున్నట్టుగా తెలుస్తోంది.