శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (21:59 IST)

కూర్చుంటే లేవలేరు... లేస్తే కూర్చోలేరు... ఏం బరువు బాబూ....

చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో సతమతమవుతుంటారు. కూర్చుంటే లేవలేరు... కూర్చునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇక నడవడం, పని చేయడం గురించి చెప్పనక్కర్లేదు. ఇలా అధిక బరువు, ఊబకాయంతో తంటాలు పడుతుంటారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. తాజా పళ్లు, కూరగాయలు నిత్యం తీసుకోవాలి. వీటిల్లో చక్కెర ఫ్యాట్‌లు ఉండవు. 
 
2. యాపిల్స్, పాలకూర వంటివి తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. 
 
3. గ్రీన్ టీ, కలబంద లాంటివి వాడడం వల్ల కూడా బరువు తగ్గుతారు. 
 
4. మిరియాలు, దాల్చిన చెక్క లాంటివి వాడడం వల్ల కూడా బరువు తగ్గుతారు. 
 
5. గ్లాసుడు నీళ్లలో రెండు టీ స్పూన్లు వెనిగర్ వేసుకుని తాగితే శరీర బరువు తగ్గుతారు. శరీర బరువు తగ్గాలనుకున్నప్పుడు నీళ్లు కూడా బాగా తాగుతుండాలి.
 
6. ఒత్తిడి వల్ల కూడా కొందరు ఎక్కువ తినేస్తుంటారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేస్తే మంచిది.
 
7. క్రమంతప్పకుండా సమయానికి తినాలి. లావు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్, భోజనం మానేయడం మంచి పద్ధతి కాదు. మితంగా ఆహారం తీసుకోవాలి. తిండి తినడం ఎగ్గొడితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం పోదు. 
 
8. లావుగా ఉండేవారు నిత్యం వ్యాయమాలు చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. వేగంగా బరువు తగ్గుతారు. 
 
9. ప్రోసెస్డ్ ఫుడ్స్ అస్సలు తినొద్దు. వీటిలో ప్రిజర్వేటివ్స్, ఫ్యాట్, షుగరు, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటాయి.
 
10. తక్కువ నూనెతో వంటకాలు చేసుకోవాలి. వేపుడు పదార్థాలు తినకుండా ఉంటే మంచిది.