శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (12:01 IST)

కొబ్బరినూనెను వంటకు ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి?

కొబ్బరినూనె వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిగతా నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె ప్రధమ స్థానంలో ఉంటుంది. కేరళలో కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని ఎక్కువుగా తీసుకుంటారు. అందువల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో గుండె జబ్బులు చాలా తక్కువుగా ఉంటా

కొబ్బరినూనె వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిగతా నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె ప్రధమ స్థానంలో ఉంటుంది. కేరళలో కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని ఎక్కువుగా తీసుకుంటారు. అందువల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో గుండె జబ్బులు చాలా తక్కువుగా ఉంటాయని పరిశోధనలో తేలింది. కొబ్బరి నూనెను ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వలన అధిక బరువు తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని పెంచడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం... ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో చూద్దాం.
 
1. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా వున్నాయి. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర హానికర శిలీంద్రాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కొబ్బరి నూనె వాడకం వలన అనేక రకాల అంటువ్యాధులను తరిమి కొట్టవచ్చు.  
 
2. మన శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంచటానికి కొబ్బరినూనె సహాయపడుతుంది. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా మూత్రపిండాలలో ఉన్న రాళ్లను, పిత్తాశయంలో ఎదురయ్యే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 
 
3. కొబ్బరినూనెలో సహజ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. అలాగే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ రక్తపోటు వల్ల గుండెకు హాని కలుగకుండా రక్షణనిస్తుంది. 
 
4. కొబ్బరినూనె దంతక్షయాన్ని నివారిస్తుంది. మెదడు మరియు మెదడు కణాలకు శక్తినందించి అల్జీమర్స్ బారి నుండి కాపాడుతుంది. శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే క్యాన్సర్ కణితులను ప్రేరేపించే కణాలను నాశనం చేసే శక్తి కొబ్బరినూనెకు ఉంది.
 
5. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి అందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. దేహ కాంతిని పెంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ప్రసాదిస్తుంది. జుత్తు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.