1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (21:39 IST)

భోజనాంతరం స్నానం చేస్తున్నారా.. జాగ్రత్త..?

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి. అలానే భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనుల కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. మరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే.. భోజనం తరువాత ఎలాంటి పదార్థాలు తినాలి, తినకూడదనే విషయాన్ని తెలుసుకుందాం... 
 
భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే.. తిన్న ఆహారం జీర్ణం కాక పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన భోజనం చేసిన రెండు గంటల తరువాత నిద్రించాలి. అప్పుడే ఇలాంటి సమస్య రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చాలామంది భోజనం తిన్న తరువాత స్నానం చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. భోజనాంతరం స్నానం చేస్తే కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దాంతో పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కనుక వీలైనంతవరకు స్నానం చేసిన తరువాత భోజనం చేయండి.
 
కొందరైతే భోజనం చేసిన వెంటనే నడుస్తుంటారు. ఎవరైన అడిగేతే.. తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఇలా చేస్తున్నానని చెప్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. భోజనాంతరం నడిస్తే.. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరంలో చేరకుండానే జీర్ణమైపోతాయి. దాంతో శరీరానికి కావలసిన పోషకాలు అందకుండా పోతాయి. అందువలన భోజనం చేసిన వెంటనే నడవకుండా.. ఓ గంట తరువాత నడవండి చాలు.