రాత్రి పడుకునే ముందు పచ్చకర్పూరం గుళిక ఒకటి మింగితే...

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (19:51 IST)

camphor

కర్పూరాల్లో రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో దొరుకుతుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలిరసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చమటలు పట్టడం తగ్గిపోతాయి.
 
బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళవెంటనీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
 
బి.పి వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బి.పి పెరగకుండా అరికడుతుంది. మూత్రం పోసేటపుడు, మంట, చీము, సుఖవ్యాధులున్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళుమంటలు, అరికాళ్ళూ, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 
పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మొత్తగానూరి, దాంట్లో అయిదు గ్రాములు ఎండుద్రాక్షవేసి మళ్ళీనూరి, దీన్ని శనగగింజలంత మాత్రలగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చేందుతుంది. లైంగికశక్తి బాగా పెరుగుతుంది.
 
పచ్చకర్పూరాన్ని రోజూ మూడుపూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటుంటే, బలం, రక్తపుష్టి కలుగుతుంది. లైంగకశక్తి పెరుగుతుంది. బి.పి తగ్గుతుంది. కంటిజబ్బులు, రక్తస్రావాలు అరికడతాయి. ఏ మందు వాడుతున్నపుడైనా ఆమందుతోపాటు ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.. స్లిమ్‌గా మారండి

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని.. శరీరాకృతిని ...

news

గుండెను బలంగా ఉంచాలంటే..? మల్లెపూల టీని సేవించండి..

గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం.. శరీరానికి శ్రమ లేకపోవడమే. బిజీలో కూర్చుని గంటల పాటు ...

news

అల్పాహారమే మన కొంపముంచుతోంది.. బ్రేక్ ఫాస్ట్‌లో అధిక ఫాట్, కార్బొహైడ్రేట్లు ఉంటున్నాయా?

భారతీయులు అనారోగ్యానికి పాలవడానికి వారు తీసుకునే అల్పాహారమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో ...

news

అయొడైజ్డ్ ఉప్పుతోనే స‌మ‌స్యా... బీపీ కూడా దానివల్లేనా?

ఇదివ‌ర‌కు పాతత‌రంలో రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై, యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ ...