అలోవెరా(కలబంద)ను రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారు... అందులో ఏముంది?

శుక్రవారం, 17 మార్చి 2017 (20:20 IST)

అలోవెరా మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ పుష్కలంగా ఉండే అలోవెరా రక్తకణాలు, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. మన శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను, విషపదార్థాలను వెలుపలికి నెట్టి వేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. 
 
యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది. మధుమేహ రోగుల ఆహార నియంత్రణ వలన ఏర్పడే పాదాలలో తిమ్మిర్లు మొదలైన సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వేసవిలో అలోవెరా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చు. తేనె, పసుపు, పాలు, అలోవెరా వేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకుంటే చర్మ మృదువుగా తయారవుతుంది. అలాగే కలబంద డ్రై స్కిన్ నివారించడంలో కూడా చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. అందుకు నిమ్మరసం, ఖర్జూరం, కలబంద మిక్స్ చేసి ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
సున్నితమైన చర్మం కలిగిన వారు అలోవెర ఫేస్ ప్యాక్ కోసం కీరదోసకాయ రసంలో కలబంద, రోజ్ వాటర్ మిక్స్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్‌గా లేదా ఫేస్ వాష్‌గా ఉపయోగించుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గ్రీన్ టీ రోజుకు 2 కప్పులు ఓకే.. మూడుకు మించితే సంతానం కలుగదా?

బరువు తగ్గాలని తెగ గ్రీన్ టీలు తాగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మోతాదుకు మించి గ్రీన్ ...

news

ప్రణాళికలు వేసుకుని తింటున్నా లావైపోతూ వుంటే కారణాలు ఇవే...

శరీరం లావుగా మారిపోయి వికారంగా తయారయినప్పుడు పదిమందిలో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఆకారంపై ...

news

ఎండాకాలంలో చెరుకు రసం... ఈ రసాన్ని ఎవరు తాగకూడదో తెలుసా?

చెరుకులో కూడా రకాలున్నాయి. వీటిలో తెల్ల చెరుకు, నల్ల చెరుకు, ఎర్ర చెరుకు అనేవి ...

news

ఉపవాసం ఉంటే.. నిత్యయవ్వనులుగా ఉంటారట.. బరువు కూడా తగ్గుతారట..

ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా ...