శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 17 జులై 2017 (20:07 IST)

రోజుకో యాలక్కాయ తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా?

పిండి వంటలు తయారు చేసేటప్పుడు సువాసన కోసం యాలకుల పొడిని ఉపయోగిస్తాం. ఇవి లేకుండా పిండి వంటలు ఏవీ వండరని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఇవి కేవలం సుగంధానికే కాక కొన్ని రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. * యాలకులు మనస్సుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మన మ

పిండి వంటలు తయారు చేసేటప్పుడు సువాసన కోసం యాలకుల పొడిని ఉపయోగిస్తాం. ఇవి లేకుండా పిండి వంటలు ఏవీ వండరని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఇవి కేవలం సుగంధానికే కాక కొన్ని రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. 
 
* యాలకులు మనస్సుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మన మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి. 
 
* ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. నోటి దుర్వాసన వున్నవారు తరుచూ యాలకులు వాడటం వల్ల ఎంతో ఉపయోగం వుంటుంది. నోట్లో చిగుళ్ళు నుంచి రక్తంకారే వ్యాధి కూడా తగ్గిపోతుంది.
 
* ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు రోజుకో యాలక్కాయను తింటే మంచిది. దీనివలన పొట్టలోని మలినాలు కూడా పోతాయి. అజీర్ణాన్ని నిరోధిస్తాయి.
 
* యాలకులు గుండెకు మంచి టానిక్కు లాంటివి. వీటిని తరుచుగా తింటుంటే గుండెకు మంచి బలాన్నిస్తాయి.