శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:57 IST)

ప్రతిరోజూ లవంగం 'టీ' తీసుకుంటే?

లవంగాలు మంచి వాసనకు మాత్రమే కాదు చక్కని రుచి కూడా ఇస్తుంది. ఈ లవంగాలతో చేసే టీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ లవంగాలు టీలో గల ఆరోగ్య ప్రయోజనాల

లవంగాలు మంచి వాసనకు మాత్రమే కాదు చక్కని రుచి కూడా ఇస్తుంది. ఈ లవంగాలతో చేసే టీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ లవంగాలు టీలో గల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
ఒక పాత్రలో నీళ్లను తీసుకుని బాగ మరిగించుకోవాలి. తరువాత లవంగాల పొడిచేసుకుని దానిని ఆ నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగ మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టి దానిని సరిపడా తేనెను అందులో కలుపుకోవాలి. ఈ టీని తీసుకుంటే దంతాలు, చిగుళ్లు నొప్పులు తగ్గుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియాలు నశిస్తాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. 
 
జ్వరం గల వారు రోజు 3 పూటలా ఈ లవంగాల టీని తీసుకుంటే వెంటనే ఉపమనం పొందవచ్చును. ఈ టీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. లవంగాల టీని చర్మానికి రాసుకుంటే దురదలు తగ్గుతాయి. ఈ టీని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కాసేపటి తరువాత వాటిని తీసుకుని శరీరంలో నొప్పులకు రాసుకుంటే వెంటనే నొప్పులు తగ్గిపోతాయి.